అన్ని లెక్కలు రాస్తున్న.. వచ్చే సంక్రాంతికి ఎక్కడ ఉంటావో చూసుకో – పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్

-

అన్ని లెక్కలు రాస్తున్న.. వచ్చే సంక్రాంతికి ఎక్కడ ఉంటావో చూసుకో  అని పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.భోగి మంటలలో జీవో నెంబర్ 1 కాఫీలు వేసి నిరసన తెలిపారు టిడిపి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. స్వగ్రామం నారావారిపల్లె లో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేస్తామని, అందుకే తాను జీవో నెంబర్ వన్ కాపీలను భోగిమంటల్లో వేస్తున్నట్లు వివరించారు. మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయ్…పుంగనూరులో పది రోజుల్లో వందమంది పై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ పండగగా పూట మావాళ్ళు జైల్లో ఉన్నారు….మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరిస్తున్నా..వచ్చే పండగకు ఎక్కడ ఉంటావో చూసుకో..అన్ని లెక్కలు రాస్తున్న…. ఈసారి క్షమించే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు చంద్రబాబునాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version