ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. కరోనా ప్రభావంతో యూరప్ సహా పలు దేశాల్లో అల్లకల్లోలం నెలకొందన్న ఆయన… కేవలం లాక్‌డౌన్ ప్రకటించినంత మాత్రాన వ్యాధిని కట్టడి చేయలేమని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం యుద్ధం ప్రాతిపదికన పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కోరారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వాలని, అంతేగాక రూ.5 వేలు తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. లాక్‌డౌన్ ను ఆసరగా చేసుకొని కొందరు వ్యాపారులు కూరగాయల కృతిమ కొరత సృష్టిస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ధరల పెరుగులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోకి విదేశాల నుంచి ఇప్పటికే 15వేల మంది వచ్చారని, వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని విజ్ఞప్తి చసారు.
ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని.. మార్చి 29నే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బియ్యంతో పాటు కిలో కందిపప్పును కూడా ఉచితంగా ఇవ్వను౦ది రాష్ట్ర ప్రభుత్వం. కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, ఆక్వా, పశుగ్రాసం సరఫరా రవాణాకు అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఆదేశాలు ఇచ్చారు.