చంద్రబాబు జీవితమే అబద్దాలతో మొదలైంది – సజ్జల

-

చంద్రబాబు జీవితమే అబద్దాలతో మొదలైందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ .తెలంగాణలో కలుస్తామంటూ ఓ ఐదు ముంపు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారో లేదోననే విషయాన్ని నేను ఫాలో కాలేదన్నారు.
ఆ గ్రామాల ప్రజలు తీర్మానం చేసి ఉంటే.. ఏ కారణంతో తీర్మానాలు చేశారో చూడాల్సి ఉందన్నారు.ఇప్పుడే వారికి ఆ ఆలోచన వచ్చిందా..? లేక గతం నుంచి ఆ ఆలోచనలో ఉన్నారా..? అనేది తేలాల్సి ఉందన్నారు.

ఆ గ్రామాల్లో నిజంగా ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు సజ్జల.చంద్రబాబు వరద పర్యటనలో సాయం అందలేదని ఒక్కరూ చెప్పలేదన్నారు.వరద సాయం అందుతుందా..? లేదా..? అని తెలుసుకోవడానికి వెళ్లారా..? లేక ప్రచారానికా..? అంటూ మండిపడ్డారు.వరద సాయం విషయంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ప్రజలందరకీ తెలుసన్నారు. నలభై ఏళ్లుగా చంద్రబాబుది అబద్దపు జీవితమేనని,చంద్రబాబు జీవితమే అబద్దాలతో మొదలైందనీ అన్నారు.అధికారం అనేది తన హక్కని చంద్రబాబు భావిస్తారనీ,తన హక్కులకు భంగం వాటిల్లితే చంద్రబాబు సహించలేకపోతారనీ అన్నారు.

విపత్తుల్లో ఫొటోలకు ఫోజులివ్వడమే చంద్రబాబు ప్రాధాన్యత అని ఎద్దేవా చేశారు.చంద్రబాబు విన్యాసాల వల్లే పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి.. చాలా మంది చనిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారుప్రకృతి విపత్తుల సమయంలో అధికారులను పని చేసుకోనివ్వకుండా చంద్రబాబు వారి కాళ్లకు అడ్డం పడేవారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు హయాంలో వరదల వంటి విపత్తుల్లో తక్షణ సాయం అందించిన ఒక్క సంఘటనైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు.జగన్ ప్రభుత్వానికి కావాల్సింది ప్రచారం కాదు.. పని జరగడం కావాలన్నారు.వరద సాయం కింద మూడు రోజుల్లో వరద ప్రభావిత జిల్లాలకు చెరో రూ. 5 కోట్లు రిలీజ్ చేశామని.. వంట సామాగ్రి అందించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news