జీఎస్టీ విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. 2022 క్యాలెండర్ ఏడాది నుండి కొన్ని మార్పులు రానున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుండి అంటే జనవరి 1 నుండి ఇవి అమలులోకి వస్తున్నాయి.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… 2017 లో ప్రవేశపెట్టిన జీఎస్టీ 2022 నుండి కఠినంగా మారనుంది. పలు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే విషయానికి వస్తే… దుస్తులు, పాదరక్షలులో మార్పులు వస్తున్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్స్ వీటి పైన జీఎస్టీని 5 నుండి 12 శాతానికి పెంచడం జరిగింది. పెరిగిన ధరలతో సామాన్యులకు మరింత ఆర్ధిక భారం పడనుంది. అలానే సింథటిక్ ఫైబర్, నూలు పై జిఎస్టిని 18 నుండి 12 శాతానికి తగ్గించారు. అలానే కాటన్ మినహా రెడిమేడ్ దుస్తులపై అన్ని రకాల వస్తువులు ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది.
ఇది ఇలా ఉంటే క్యాబ్, ఆటో, బైక్ ద్వారా ఆన్లైన్లో ప్రయాణికులు సేవలు అందించే సంస్థలు అయినా ఓలా, ఊబర్ వంటి వాటికి 5 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆఫ్ లైన్ బుకింగ్ కి అయితే మినహాయింపు ఉంటుంది. అలానే ఒకటో తేదీ నుంచి స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ నేరుగా కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేసే ప్రభుత్వానికి జమ చేయాలి.
జీఎస్టీ రిఫండ్ రీఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త ఏడాది నుండి ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో పాన్ నెంబర్ కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలోని రిఫరెన్స్ వేసేలా చర్యలు చేపట్టింది. ఇలా ఈ విధమైన మార్పుల్ని కేంద్రం చేసింది.