రైల్వే టికెట్ బుకింగ్ లో మార్పులు..!

-

రైల్వే ప్రయాణికులకు గమనిక. తప్పకుండ ఈ విషయాలని రైల్వే ప్రయాణికులు తెలుసుకోవాలి. అయితే ఇక ఈ ముఖ్యమైన గమనికకి సంబంధించి చూస్తే.. రైల్వే టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయడం జరిగింది.

రైల్వే టికెట్‌

దీనితో రైల్వే ప్రయాణికులు రైల్వే టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు కార్డులను ద్వారా టికెట్‌ తీసుకోవాలి గమనించండి. ఒక వేళ కనుక వీటిని తీసుకెళ్లక పోతే టికెట్ తీసుకునే సమయం లో కష్టం అవ్వచ్చు.

అయితే ఇలా చేయడం వలన దళారీ వ్యవస్థ అంతమవుతుందని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. ఇందు కోసం ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లో టికెట్‌ బుకింగ్‌ చెయ్యాలంటే పాన్‌, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులను తప్పని సరి చేస్తే ఇటువంటివి నిలిపేయచ్చని అన్నారు. గతంలో చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆధార్‌ అధికారులతో సంప్రదింపులు జరిపామని, త్వరలో మిగిలిన గుర్తింపు కార్డుల జారీ యంత్రాంగాలతోనూ చర్చిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది.

ఇది ఇలా ఉంటే రైల్వే ప్రయాణికులకు ఆర్పీఎఫ్‌ పెద్దపీట వేస్తోందని, కొవిడ్‌ సమయంలోనూ ప్రయాణికుల రక్షణలో ఎంతో జాగ్రత్తగా ఉన్నాయని, అవసరమైన వాటిని పాటించి ముందు వరుసలో నిలిచిందన్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news