కంటి సమస్యలు ఎన్నైనా అన్నాట్టో గింజలతో చెక్‌ పెట్టేయండి..!

-

కంటి సమస్యలకు ఈరోజుల్లో వయసుతో సంబంధం లేదు.. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ ఉంటున్నాయి.. స్కూల్‌ ఏజ్‌ నుంచే స్పెట్స్‌ పెట్టుకునే వాళ్లను చూశాం. పాపం వాళ్లు అప్పటినుంచే జోళ్లు వాడితే…ఇక వృద్ధాప్యం వరకూ వాడాల్సిందేనా..? కంటి సమస్యలకు ప్రధాన కారణం..స్క్రీన్‌ లైటింగ్. కంటి మీద లైట్ల వెలుగు ప‌డే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తింటుంది. చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం, కంటి చూపులో మార్పులు రావ‌డం స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బ‌తిన‌కుండా చేయ‌డంలో అన్నాట్టో గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ గింజ‌లు మ‌న‌కు మార్కెట్‌లో, ఆన్ లైన్‌లో విరివిరిగా ల‌భిస్తాయి. ఈ గింజ‌ల్లో ఉండే బిక్సిన్, నార్ బిక్సిన్ అనే ర‌సాయ‌న మూల‌కాలు ఉంటాయి. ఇవి కంటిలో విడుద‌ల‌య్యే ఎ జెడ్ ఇ అనే మూల‌కం యొక్క ప్ర‌భావాన్ని త‌గ్గించి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తినకుండా చేస్తాయి. మ్యాక్యులాకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చ‌క్క‌గా జ‌రిగేలా చేయ‌డంలో కూడా ఈ ర‌సాయన మూల‌కాలు ఉప‌యోగప‌డ‌తాయి. కంటిలో విడుద‌ల‌య్యే ఎ జెడ్ ఇ అనే మూల‌కం అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారిలో ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అలాగే డ‌యాబెటిస్ ఉన్న వారిలో కూడా ఈ మూల‌కం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అధిక ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ ఉన్న వారిలో కంటిచూపు దెబ్బ‌తింటుంది. ఇలా కంటి చూపు దెబ్బ‌తిన్న‌కుండా చేయ‌డంలో ఈ అన్నాట్టో గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

డ‌యాబెటిస్ లేకున్నా, ర‌క్త‌పోటు లేకున్నా కూడా కంటి చూపు మందగిస్తుంది. అలాంటి వారు కూడా ఈ అన్నాట్టో గింజ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కంటి చూపు దెబ్బ‌తిన‌కుండా చేసుకోవ‌చ్చు. ఈ గింజ‌ల‌ను పొడిగా చేసి స‌లాడ్స్‌లో చ‌ల్లుకోవ‌చ్చు. అలాగే వంటల్లో కూడా పొడిగా చేసి వేసుకోవ‌చ్చు. ఈ విధంగా ఈ అన్నాట్టో గింజ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కంటి చూపుకు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

ఈ గింజ‌లు మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, గాయాలు త్వ‌ర‌గా మానేలా చేయ‌డంలో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కంటి చూపుకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఉన్నవారు ఈ అన్నాట్టో గింజ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news