సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా…? అయితే ఇవి ముఖ్యం తెలుసుకోండి..!

-

చాలా మందికి బ్యాంకుల్లో అకౌంట్ ఉంటూనే వుంది. ఎక్కువ మంది ఒక బ్యాంక్ నుండే కాక ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటున్నాయి. ఒకవేళ కనుక మీ బ్యాంక్ అకౌంట్ నిరుపయోగంగా ఉంటే చార్జెస్ కట్ అయ్యిపోతు ఉంటాయి చూసుకోండి. సేవింగ్స్ అకౌంట్ ని క్లోజ్ చేసేటప్పుడు పలు విషయాల్లో జాగ్రత్త పడడం మంచిది.

సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసే సమయంలో తప్పనిసరిగా ఇవి మరచిపోవద్దు. అయితే మీరు కనుక మీ సేవింగ్స్ అకౌంట్ ని క్లోజ్ చెయ్యాలి అని అనుకుంటే వీటిని తప్పక చూసుకోండి. లేదంటే సమస్యలు వస్తాయి.

ఫస్ట్ ఆటోపేమెంట్ మోడ్ ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చెయ్యండి. ఆ తరవాత మాత్రమే క్లోజ్ చెయ్యండి. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్‌లో లోన్ ఈఎంఐ, బిల్ పేమెంట్స్ కోసం మీ అకౌంట్ ని పెట్టే ఉంటారు. కనుక ఫస్ట్ ఆటోపేమెంట్ మోడ్ ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చెయ్యండి.
కంప్లీట్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను తీసి అప్పుడు సేవింగ్స్ అకౌంట్‌ను క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఎప్పుడైనా అవసరం అవ్వచ్చు.
అకౌంట్ ని క్లోజ్ చేసేముందు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉందొ చూడండి.
మీరు మీ అకౌంట్ ని ఓపెన్ చేసిన సంవత్సరం లోపే క్లోజ్ చేస్తుంటే.. వాటికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది చూసుకోండి.
ఈపీఎఫ్‌ఓ, ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు లింక్ అయి ఉన్నాయో లేదో అకౌంట్ ని క్లోజ్ చేసే ముందు చూడండి. ఒకవేళ కనుక లింక్ అయ్యి ఉంటే తొలగించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news