గుజరాత్ లో చెడ్డి గ్యాంగ్ అరెస్ట్…పెళ్ళిలో ప్లాన్ సౌత్ నే టార్గెట్…!

విజయవాడ గుంటూరులో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఆ గ్యాంగ్ ను పోలీసులు గుజరాత్ లో పట్టుకున్నారు. గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులు పోలీసుల చేతికి చిక్కగా వారిని పోలీసులు విజయవాడకి తీసుకువచ్చారు. అరెస్ట్ అయ్యిన వారిలో దాహొద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మాడియా కాంజి మేడా, సక్ర మండోడ్, మధ్య ప్రదేశ్ కు చెందిన కమలేష్ బాబెరియా అలియాస్ కమలేష్ ఉన్నారు. అంతే కాకుండా మరో ఏడుగురు సభ్యులు పరారీలో ఉన్నారు.

దాంతో వారి కోసం పోలిసుల బృందాలు గాలిస్తున్నాయి. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం మరియు 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లోని గల్చర్ గ్రామం లో మధ్యప్రదేశ్ కు చెందిన 10మంది దొంగలు గత నెల 22న పెళ్ళిలో కలుసుకున్నారు. అప్పుడే సౌత్ లో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ చేరుకుని ఐదుగురి చొప్పున ముఠా గా ఏర్పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఆ తరవాత మళ్లీ గుజరాత్ కు వెళ్ళిపోయారు.