డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ తీపి కబురు

డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కార్ తీపి కబుర్లు చెప్పింది. డీఎస్సీ 2018 సంవత్సరం నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీ పోస్టుల నీటిని భర్తీ చేయాలని విద్యా శాఖ కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దీంతో పోస్టుల భర్తీపై దృష్టిసారించారు ది విద్యాశాఖ. ఇప్పటికే డీఈఓ పోస్టులకు.. మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ను ఇచ్చామని పేర్కొంది ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ.

ప్రొవిజనల్, అభ్యర్థుల ఎంపిక జాబితాలను ఈనెల 20, 21 తేదీల్లో తయారు చేసి… అభ్యర్థులకు 22వ తేదీన మెసేజ్లు పెట్టాలని అధికారు లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే 23 మరియు 24 వ తేదీలలో ధ్రువపత్రాల అప్లోడింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది విద్యా శాఖ. అంతేకాదు 24వ తేదీ నుంచి 28వ తేదీ ల మధ్య దరఖాస్తుల పరిశీలన ఉంటుందని… 30 మరియు 31 తేదీల్లో ఈ పోస్టుల కౌన్సిలింగ్ చేయాలని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఇక జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో.. డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.