చైనా అంటేనే.. అదొక విచిత్రమైన దేశం. వారు పాటించే ఆహారపు అలవాట్లే కాదు, ఇతర విధానాలు కూడా వింతగా ఉంటాయి. ఈ క్రమంలోనే చైనాలో ఓ కొత్త పద్ధతి బాగా ట్రెండ్ అవుతోంది. అక్కడి పిల్లలకు కోళ్లకు చెందిన రక్తం ఇంజెక్షన్లను ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ వివరాలను సింగపూర్ పోస్ట్‌లో వెల్లడించారు.
భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి చైనాలో పిల్లలకు కోళ్ల రక్తం ఇంజెక్షన్లను ఇస్తున్నారు. సంతాన లోపం, క్యాన్సర్, బట్టతల వంటి సమస్యలు రావని చెప్పి అక్కడి తల్లిదండ్రులు ఈ విధంగా చేస్తున్నారు. అయితే మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఇలా చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా చైనాలో యువత చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. సుప్‌చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019-20లో మొత్తం యువతలో 25 శాతం మంది చైనా యువత డిప్రెషన్ బారిన పడగా వారిలో 7.4 శాతం మంది అత్యంత తీవ్రమైన డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
అయితే యువత డిప్రెషన్ బారిన పడేందుకు తల్లి దండ్రులు పలు అంశాల్లో చేస్తున్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది. కానీ చికెన్ బ్లడ్ ఇంజెక్షన్స్‌కు, ఒత్తిడికి ఏం సంబంధం ఉంది ? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.