ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ ధరలు రికార్డు స్థాయి ధరకు చేరకున్నాయి. హోల్ సేల్ మార్కెట్ లో బాయిలర్ చికెన్ కిలో 312 రూపాయలకు చేరింది. మటన్ ధర నిలకడగా ఉండగా.. చికెన్ ధరలు మాత్రం మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.
చికెన్ లైవ్ ధర కూడా కేజీ 166 రూపాయలకు చేరింది. అటు అంత ధర పెట్టి కొనలేక.. ఇటు తినకుండా ఉండలేక కేజీ కొనేవారు.. ఇప్పుడు అరకేజీ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కొండెక్కిన చికెన్ రేట్లు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి.
అయితే..కరోనా నేపథ్యంలోనే.. అందరూ చికెన్ ఎక్కువగా తినాలని చెప్పడంతో.. వాటి అమ్మకాలు పెరిగాయి. తద్వారా.. రేట్లు క్రమంగా పెరిగాయి. ఇటీవల 280 రూపాయలకు చేరినప్పడే రికార్డు ధర అనుకుంటే.. ఇప్పుడు అంతకు మించి 312 రూపాయలకు చేరడంతో.. చికెన్ ప్రియులకు మింగుడుడు పడటం లేదు.