షాకింగ్‌ : పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనండి.. చైనా కీలక నిర్ణయం..

-

చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా తగ్గుతుండటంతో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ పెళ్లి చేసుకోకపోయినా చట్టబద్ధంగా పిల్లల్ని కనొచ్చ ఆరోగ్య కమిషన్ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. పెళ్లి కాకుండా పిల్లల్ని కన్నవారికి పెళ్లైన జంటలతో సమానంగా వైద్య బిల్లులు కవర్ అయ్యేలా బీమా, ప్రసూతి సెలవుల్లో జీతం వంటి బెనిఫిట్స్ ను ఇస్తామని తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. పాత నిబంధనల ప్రకారం చైనాలో వివాహితులు మాత్రమే చట్టబద్ధంగా పిల్లల్ని కనడానికి పర్మిషన్ ఉండేది.

కొత్తగా తెచ్చిన ఈ నిబంధనతో ఒంటిరిగా ఉండే వారు కూడా పిల్లల్ని కనొచ్చు. దీని కోసం సిచువాన్ అధికారుల వద్ద రిజస్టర్ చేసుకోవాలి. అంతేకాదు పిల్లల విషయంలో ఎలాంటి పరిమితులు లేవు.చైనాలో గత సంవత్సరం నుంచి జననాల రేటు తగ్గడం,మరణాల రేటు పెరగడం ఆదేశాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version