శ్రీలంక దేశం భారత్ మాటలను పట్టించుకోకుండా చైనా స్పై షిప్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో చైనాకు చెందిన యువాంగ్ వాంగ్-5 ఈ రోజు ఉదయం హంబన్‌టోటా పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని రేవులోని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డెసెల్వ ప్రకటించారు. ఈ నౌక రాకతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే మొదట్లో శ్రీలంక కూడా భారత నిర్ణయాన్ని కట్టుబడి ఉంది.
ఆ తర్వాత ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా.. మళ్లీ పర్మిషన్ దొరినట్లు తెలిసింది. దీంతో యువాన్ వాంగ్ నౌక హంబన్‌టోటా పోర్టుకు కదిలింది. అయితే ఈ నౌక శ్రీలంక పరిధిలోకి వచ్చినప్పుడు ఆటోమెటిక్ ఇడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ఆఫ్ చేయాలనే నిబంధన అమలు చేసినట్లు శ్రీలంక వెల్లడించింది. అలాగే శ్రీలంకలో ఎలాంటి సర్వే నిర్వహించడానికి అనుమతిని ఇవ్వలేదు. ఆగస్టు 16 నుంచి 22 తేదీల్లో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు శ్రీలంక వెల్లడించింది.