”ఆ రోజుల్లో మా నాన్నగారూ..” అనేది బాలకృష్ణ ఊతపదం. బాలయ్య ప్రతి వేదికపై తండ్రి నందమూరి తారకరామారావు ప్రస్తావన తెస్తారు. మాకంటే ఎవరూ గొప్ప కాదంటారు. బాలయ్య ఈ వైఖరిపై చిరంజీవి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో ఉన్న చిరు.. బాలయ్య గురించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే..?
“రామ్ చరణ్ ప్రతిసారి, ప్రతి చోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. మా నాన్న చిరంజీవి, ఆయన చాలా గొప్పోడు అంటూ ప్రతిసారి చెబుతుంటే… జనాలకు విసుగొచ్చేస్తుంది. హే ఆపవయ్యా నీ సుత్తి అని చరణ్ ని తిడతారని” చిరంజీవి కామెంట్ చేశారు. చిరంజీవి అక్కడ ఉదహరించిన తీరు చూస్తే బాలయ్యని ఉద్దేశించే అన్నట్లు ఉంది.
వాల్తేరు వీరయ్య ప్రీరీలీజ్ ఈవెంట్లో సైతం చిరంజీవి బాలయ్యను టార్గెట్ చేశారు. శ్రుతి హాసన్ ఈవెంట్ కి అనారోగ్య కారణాలు చూపుతూ హాజరు కాలేదు. ఆమె ప్రస్తావన తెస్తూ.. ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు. సడన్ గా శ్రుతి ఆరోగ్యం బాగోలేదంట. బహుశా ఆమెను ఎవరైనా బెదిరించారేమో… అని నవ్వుతూ సెటైర్స్ వేశారు.
పరోక్షంగా బాలకృష్ణకి చురకలు అంటించిన చిరంజీవి 😃🫢#Chiranjeevi #Balakrishna pic.twitter.com/kyFMfB7JID
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) January 11, 2023