ఈ కేసులో కాకాని పాపం పండుతుంది : సోమిరెడ్డి

-

మరోసారి సీబీఐ అధికారులు విచారించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను సీబీఐ అధికారులకు అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులకు ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని సిబీఐ అధికారులు ఎదుట హాజరయ్యే అవకాశం నాకు కలిగిందన్నారు. మరో వారంలో మళ్లీ పిలుస్తామని చెప్పారన్నారు. అంతేకాకుండా.. ‘లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటామని చెప్పారు. చంద్రమోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీల వద్దకు వెళతానని అప్పట్లో కాకాని చెప్పారు. కానీ ఇప్పుడు సి.బి.ఐ. కేసు పెట్టింది. కాకాని ఎప్పుడూ నిజం చెప్పడు. అన్ని అబద్ధాలే. ఈ కేసులో కాకాని పాపం పండుతుంది.

పరునష్టం దావాకు సంబంధించిన తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయి. ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడు. కోర్టులో జరిగిన దొంగతనం కేసు కూడా చాలా కీలకంగా మారుతుంది. కోర్టులో ఒక రాజకీయ వేత్త దొంగతనం చేయించడం సంచలనంగా మారింది. రాజకీయ ప్రత్యర్థైన తన మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. కాకాని రూపొందించిన డాక్యుమెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను జగన్మోహన్ రెడ్డి కి కూడా పంపిస్తా. దాన్ని చూసి ఆయనకు ఉప. ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నా నేను పెట్టిన మూడు కేసుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడూ. ఇంత దిగజారి కుటుంబాలను నాశనం చేసేందుకు తప్పుడు పత్రాలు విడుదల చేయకుండా చూస్తాం’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news