చిరంజీవి గారి జ్ఞాపకాన్ని ఫోటో ప్రేమ్ లో దాచుకున్నా.!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  విడుదల కు సిద్ధంగా ఉంది ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. ఈప్రమోషన్స్  కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది. ఆది వారం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఆర్ కే బీచ్ లో  కాన్సిల్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మార్చారు. ఇక శనివారం విడుదల అయిన ట్రైలర్ కు అధ్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. నిమిషాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి

ఇక ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య ఫస్ట్ కాపీని చిరంజీవి చూసి ‘బస్టర్ కొడుతున్నాం బాబీ’ అన్నారు. ఆ రోజు నేను గర్వంగా ఫీలయ్యాను. ఆయన నన్ను ఓ తమ్ముడిగా దగ్గరకు తీసుకున్న ఆత్మీయత నా జీవితంలో మర్చిపోలేను. చిరంజీవి గారి లాంటి మాస్ మూలవిరాట్ నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం మర్చిపోలేని మూమెంట్. ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకున్నా అది ఎప్పటికీ నా జీవితంలో గుర్తు పెట్టుకొనే జ్ఞాపకం అని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version