చిరంజీవి..నాగార్జున ఎవరిది ఆధిపత్యం..!!

-

దసరా కానుకగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అదే రోజున నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదల కాబోతున్నది. ఈ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. దీంతో సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడం జరిగిందట. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటివి మాత్రం అస్సలు జరగలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి విషయంలో నిర్మాతలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే చిరంజీవి, నాగార్జున పోటీపడి ఈ సినిమాను అక్టోబర్ ఐదున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా ఎక్కువగా ఆధిపత్యం కనబరుస్తుందో అంటూ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత సమయంలో మాత్రం ఎక్కువగా నాగార్జున నటించిన ఘోస్ట్ చిత్రానికి మాత్రమే ఎక్కువ ఆధిపత్యం ఉన్నట్లుగా సమాచారం. నాగార్జున కొత్త సినిమాకి సంబంధించి ఈ సినిమా హడావిడి బాగానే చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ పనులు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా చేస్తూనే ఉన్నారు చిత్ర బృందం. ఇక చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కంటే… ది ఘోస్ట్. సినిమాకి బాగా హైప్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో మాత్రం చెప్పలేము. అయితే నాగార్జున బ్రహ్మాస్త్రం సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా కూడా మొదట నెగటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత వసూలు మాత్రం పాజిటివ్ గానే వచ్చాయి. అందుచేతనే ది ఘోస్ట్ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం.. చివరికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలలో ఎక్కువగా ది ఘోస్ట్ సినిమా పైనే మంచి బజ్ ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version