మరోసారి సంచలనం సృష్టించబోతున్న చియాన్ విక్రమ్..‘కోబ్రా’ రిలీజ్ డేట్ లాక్‌డ్

-

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఈ ఏడాది ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో విక్రమ్ విభిన్నమైన పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. డెఫినెట్ గా ఈ పిక్చర్ రికార్డులను తిరగరాస్తోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ్ ప్రేక్షకులకు చివరగా తన తనయుడితో కలసి నటించిన ‘మహాన్’ ఫిల్మ్ లో కనిపించారు. ఈ చిత్రంలో కథానాయికగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించగా, విక్రమ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘అధీర అధీర’ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news