చాలా కాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో సిఎం కేసిఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అడ్రెస్ లేని విషయం తెలిసిందే. ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటినుంచి కవిత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే కేసిఆర్ ఫ్యామిలీలో అందరూ ఏదొక పదవిలో ఉన్నారు. దీంతో కుమార్తెని రాజకీయ నిరుద్యోగం నుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండకపోయినా తన ఫ్యామిలీకి మాత్రం ఏదొక ఉద్యోగం ఉండాలనే కోణంతో కేసిఆర్..కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజేపి గెలిస్తే సిఎం కేసిఆర్ రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలిచారు కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతాని ఓడించాలని బిజేపి ఛాలెంజింగ్‌కు పనిచేసి ఓడిపోయారు కాబట్టి, దానికి మోదీ బాధ్యత వహిస్తారా? అని అడిగారు. ఏదో బండి మీడియాలో కనిపించాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
అయితే ఇక్కడ కవిత లాజిక్ బాగానే చెప్పారుగానీ…హుజూరాబాద్‌లో బిజేపి గెలిస్తే కేసిఆర్‌ని రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదనే కోణంలో కవిత మాట్లాడారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది…అంటే కవిత లాజిక్ ప్రకారం హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలవదని పరోక్షంగా చెప్పేస్తున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు ఎవరిదనేది కవితకు బాగా క్లారిటీ ఉన్నట్లు ఉంది.