బాలయ్య షోలో ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ..! అప్పుడే..!

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్1 సాధించిన భారీ విజయంతో ఇప్పుడు రెండవ సీజన్ ని కూడా ప్రారంభించారు. రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ సంచలనాలకు తెరతీసింది. ఇందులో గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హాజరయ్యారు. ఇక తర్వాత రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు.. ఆ తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హాజరయ్యి ప్రేక్షకులను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2 లో మోస్ట్ వాంటెడ్ గెస్ట్ రాబోతున్నాడు అని ఆహా ఇంతకుముందే ప్రకటించింది. ఆయన ఎవరో కాదు ప్రభాస్ ..ప్రస్తుతం తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి బాలకృష్ణ అన్ స్టాటబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా హాజరయ్యారు

.

ఇకపోతే ఈ ఎపిసోడ్లో ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియా వ్యాప్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు అంటే వెంటనే ప్రభాస్ పేరు ముందుగా వినిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం వరకు ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ లవ్ లో ఉన్నారంటూ వార్తలు జోరుగా వినిపించాయి.. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని కృతి సనన్ స్పష్టం చేసింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఇందులో చాలామంది నెటిజన్స్ ప్రభాస్ పెళ్లి గురించి కూడా అడగండి సార్ అంటూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య డార్లింగ్ పెళ్లి ప్రస్తావన తెచ్చి.. ఇంతకు పెళ్లెప్పుడు చేసుకుంటావని ప్రశ్నించారట.. అప్పుడు ప్రభాస్ ఎప్పటిలానే ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారట.. అదే సమయంలో గోపీచంద్.. ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సమాధానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు నెలల్లో ప్రభాస్ వివాహం చేసుకుంటారు అని రామ్ చరణ్ బాలయ్యతో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే గోపీచంద్ కూడా వచ్చే యేడాది ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం ప్రభాస్ అభిమానులకు భారీ సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news