చైనాపై రెండు యుద్ధాల్లో గెలుస్తాం: సీఎం

-

భారత్ – చైనా సరిహద్దులో ఉద్రికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చైనాతో రెండు రకాల యుద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారిని అంతమొందించడానికి దేశంలోని వైద్య సిబ్బంది పోరాడుతున్నారని పేర్కొన్నారు. అలాగే సరిహద్దులో 20 మంది జవాన్లు వెన్నుచూపకుండా పోరాడారని.. ఈ సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలపై చైనా కుట్రపూరిత దాడులకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమై భారత సైన్యానికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

కరోనాతో పాటు చైనా సైన్యం పైనా మనం పోరాడి గెలుస్తామన్నారు. అలాగే ఢిల్లీలో కరోనా పరీక్షలను మూడింతలు చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. గతంలో రోజుకు 5 వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు దాదాపు 18 వేల పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు. ఎంత మందికైనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు.. దేశంలో కరోనా వైరస్‌ కేసుల్లో ఢిల్లీ రెండో స్థానానికి చేరిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news