ఈ ప్లాంట్‌తో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి : సీఎం జగన్‌

-

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ
పర్యటనలో గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో పరిశ్రమలకు పెద్దపీట వేశామన్నారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్‌. ఈ ప్లాంట్‌ వలన రైతులు, స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం జగన్‌. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి దగ్గర 270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేశారు సీఎం జగన్‌.

రాజమండ్రి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్‌ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version