రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌.. పలు అంశాలపై చర్చ

-

ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా బహూకరించారు. గవర్నర్ కూడా సీఎం జగన్ కు శాలువా కప్పి ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులతో సీఎం జగన్, వైఎస్ భారతి సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు.

అంతకుముందు సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందరం ఒక్కతాటిపై నడిచినప్పుడే పార్టీకి విజయాల లభిస్తాయని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలోనూ తిరగాలని, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news