గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో పనుల పురోగతిపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నెల 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒకేసారి 50 వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చే విధంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే జగన్ పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. 50 వేలకుపైగా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు 1460 ఎకరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు పేద ప్రజలు సెంటు భూమిలో ఎలా ఇళ్లు కట్టుకుంటారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తమ హయాంలో పేదలకు కనీసం 3 సెంట్ల భూమి ఇచ్చామంటూ చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సెంటు భూమి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు ఏపీ మంత్రి జోగి రమేశ్. టీడీపీ హయాంలో ఆ సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆ సెంటు స్థలంలోనే పేద ప్రజలు టీడీపీని పూడ్చటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.