బతికి ఉంటే… ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు – సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బతికి ఉంటే మరోసారి ముఖ్యమంత్రి అయి ఉండేవారని… సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తూ బిల్లును వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఈ బిల్లును టిడిపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవిస్తానని వివరించారు. తన తండ్రి వైయస్సార్ ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. గుర్తు చేశారు సీఎం జగన్.

చంద్రబాబు వెన్నుపోటు పొడవకపోతే ఎన్టీఆర్ మరోసారి సీఎం అయ్యేవారని, చంద్రబాబు సీఎం కాలేకపోయారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు పలకడం కూడా చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news