రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

-

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో రేపు(మంగళవారం) పర్యటించనున్నారు. గుంటూరులో వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్ లు పంపిణీ చేయనున్నారు. మెగా మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ లు పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూప్ బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ ని సీఎం జమ చేయనున్నారు. అలాగే హరిత నగరాలు కింద పల్నాడు జిల్లా కొండవీడు లో జిందాల్ వారి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు.

రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీ తో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. అలాగే అప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులు మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. వైయస్సార్ యంత్ర సేవా పథకం కింద మొత్తం సబ్సిడీగా రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం నాడు జరిగే మెగా మేళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news