రాజ్యంలో ముసలం లేదు. ప్రజా వ్యతిరేకత ఉంది కానీ 4 రోడ్లు, 2 పంట కాలువలు, 3 ఊళ్లు బాగు చేసి అభివృద్ధికి ఇదే నమూనా అని చెప్పి ఎన్నికలకు వెళ్లినా తప్పేం లేదు. నరేంద్రమోడీ అదే చేశారు. చంద్రబాబు కూడా స్మార్ట్ సిటీల పేరిట అదే చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఏదేమయినా కానీ జగన్ కూడా ఒక డెవలప్మెంట్ మోడల్ ను నాడు నేడు పేరిట తెచ్చారు. దానితో పాటు రోడ్ల విషయమై దృష్టి కొద్దిగా కాదు బాగా పెట్టాలి. ఆ ఫోకస్ బాగుంటే జగన్ బాగుండడం ఖాయం. లేదంటే ఆయనకు కూడా పరాభవాలు తప్పవు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేలకు ఇస్తున్న గైడెన్స్ సరిపోవడం లేదు. ఆయన కన్నా టీడీపీనే ఎక్కువ గైడెన్స్ ఎమ్మెల్యేలకు ఇస్తుంది. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని బాగానే గైడ్ చేస్తోంది.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓ పార్టీ నుంచి మరో పార్టీ నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో కనుక అలా రాశాను. ఆ విధంగా పరస్పర అవగాహన ఆ రెండు పార్టీలకు ఉందో లేదో కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 37 శాతం ఓట్లు వైసీపీ వస్తే , 30 శాతం ఓట్లు టీడీపీకి, 27 శాతం ఓట్లు జనసేనకు వస్తాయని, మిగతా ఆరు శాతం ఓట్లు ఇతరుల ఖాతాలోకి వెళ్తాయి అని ఓ సర్వే నిర్వహణ చేసిన వారు అంటున్నారు. అదేలా సాధ్యమో కానీ జగన్ మరికాస్త బాగా పనిచేస్తే గెలుస్తారు. టీడీపీ మరియు జనసేన కొట్టుకోకపోతే లాభదాయక ఫలితాలను పొందుతారు. ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అయితే బాగుంటుంది. కానీ వాళ్లు అనగా బీజేపీ పెద్దలు ఒప్పుకునేలా లేరు కనుక బీజేపీతో కూడా జనసేన బంధాలు చెప్పలేం.
సర్.. కొట్టుకోవద్దు.. గెలిచినా ఓడినా ఇప్పుడొచ్చిన నష్టమేం లేదు అన్న విధంగా టీడీపీకి వైసీపీ గైడెన్స్ ఇస్తుందా లేదా గైడ్ చేస్తుందా ? జగన్ పొలిటికల్ కోచింగ్ సెంటర్ లో బాబు జాయిన్ అయితే ఎలా ఉంటుంది ? అసలు జగన్ ను మించిన సక్సెస్ ఫార్ములా మరొకటి ఉంటుందా ? జగన్ కానీ వైఎస్ కానీ జనంలోకి వెళ్లిన పద్ధతిలో టీడీపీ వెళ్లలేకపోతోంది. తిట్టడం కాదు మహానాడు అంటే ఏం చేస్తామో చెప్పడం అని సినిమా డైలాగ్ ఒకటి వదిలాక కూడా టీడీపీ పాపం ఆ ఫిల్లర్ ను ఆ ఫీవర్ ను
అర్థం చేసుకోకపోతే ఎలా ?
జనాలకు జ్వరం తెప్పించాలి.. అనగా పూనకాలతో ఊగిపోవాలి. లేదాజ్వరం కారణంగా వణికి పోవాలి. ఆ విధంగా పొలిటికల్ ఫీవర్ ఇప్పుడు లేదు. టీడీపీ కానీ మరే ఇతర పార్టీ కానీ కొట్లాడుతూ ఉంటే హాయిగా ఇప్పుడున్న సీట్లు కన్నా ఎక్కువే జగన్ కు వస్తాయి. కనుక రాజకీయంగా ఆలోచిస్తే జగన్ సౌధాలను చంద్రబాబే దగ్గరుండి నిర్మించి ఇస్తున్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఆయన అమరావతిపై దృష్టి సారించగలరు అని గ్యారంటీ ఇవ్వలేం కానీ కొద్దో గొప్పో పనులు చేయించి రాజధాని రైతును ఆదుకోగలరు అన్న నమ్మకం అయితే మాత్రం ఇప్పటికీ అక్కడి ప్రాంత వాసుల్లో ముఖ్యంగా వైసీపీ అభిమానుల్లో ఉంది.
జగన్ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై నమ్మకం పెంచుకుంటున్నారు. ఆ విధంగా టీడీపీ కూడా ఉత్తరాంధ్రపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. పొత్తులు తేలకుండా కత్తులు దూసుకుంటూ పోతే ఫలితం ఉండదు. కనుక టీడీపీ జాగ్రత్త. ఇదే సమయాన జనసేన కూడా జాగ్రత్త. ఇదే సమయాన వైసీపీ కూడా జాగ్రత్త. ఇదే సమయంలో వీరందరినీ పర్యవేక్షణ జరిపే బీజేపీ కూడా జాగ్రత్త.