చిరంజీవి నటించిన ఆ చిత్రం ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో తెలుసా..?

-

సినిమా ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరంటే చిరంజీవి అని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికి ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరో గా పేరు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయారు. చిరంజీవి కెరియర్ ప్రారంభం నుండి ఎన్నో గొప్ప చిత్రాలలో నటించారు అలా నటించిన చిత్రాలలో యముడికి మొగుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం చిరంజీవితో పాటు ఎంతో మంది నటులకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.Watch Yamudiki Mogudu on ott streaming online

చిత్రసీమలోకి ఎంట్రీ కాకముందే చిరంజీవి, సుధాకర్ రూమ్మేట్స్.. అయితే అప్పటి వరకు విలన్ పాత్రలో చేసిన సుధాకర్ యముడికి మొగుడు చిత్రం ద్వారా కమెడియన్గా మారారు. ఇక ఆ తరువాత సుధాకర్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్గా మారిపోయారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా సుధాకర్ కూడా వ్యవహరించారు. ఇక ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్ని అందించారు దీంతో ఆయన అమాంతం క్రేజ్ సంపాదించుకున్నారు.

ఈ సినిమాతో చిరంజీవి ఇద్దరి స్నేహితులైన నారాయణరావు, హరి ప్రసాద్ లకు కూడా మంచి లైఫ్ ఇచ్చారు అని చెప్పవచ్చు ఈసినిమాకు చిరంజీవితో పాటు సుధాకర్, నారాయణ రావు, హరి ప్రసాద్,సుధాకర్ కలిసి డైనమిక్ అనే మూవీ బ్యానర్ ను ప్రారంభించి సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది దీనితో వీరందరికీ మంచి లాభాలు అందుకున్నట్లు గా సమాచారం. ఏదిఏమైనా చిరంజీవి తన కెరీర్లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news