21 రోజుల పాటు..తెలంగాణ సంబురాలు నిర్వహించాలి : సీఎం కేసీఆర్

-

పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో…తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను.. అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ ఉత్సవాలు.. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో.. డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాల ప్రారంభమౌతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు…తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాల పై.. శనివారం నాడు సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

7 of top 10 villages in India are from Telangana: CM KCR

ఈ సమీక్షా సమావేశంలో…. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజీపి అంజనీకుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహదారులు రమణాచారి, అనురాగ్ శర్మ, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్ శర్మ, సింగరేణి కాలరీస్ సీఎండి శ్రీధర్, ఫైనాన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతిరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, మైనారిటి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఎస్సీడిడి రాహుల్ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎమ్. రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ హన్మంతరావు, మత్య్సశాఖ డైరెక్టర్ లచ్చిరామ్ బుక్యా, అనిమల్ హజ్బండరీ శాఖ డైరెక్టర్ రామచందర్, విజయ డైరీ మార్కెటింగ్ డైరెక్టర్ మల్లికార్జున్, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శేషాద్రీ, ప్రొటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ ఎస్ఎఎమ్ రిజ్వీ, , హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితెందర్, హ్యాండ్లూమ్స్ శాఖ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సిడిఎమ్ఎ సత్యనారాయణ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఇవి నర్సింహరెడ్థి, బిసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిష్టినా జడ్ చోంగ్తూ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతీ హోలికేరి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ట, ముషారఫ్ అలీ తో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2 వ తేదీ నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సుగల రాష్ట్రం. అయినా కూడా…ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. నేడు తెలంగాణ దేశానికే వొక రోల్ మోడల్ గా మారింది. మన ప్రగతి ని చూసి ఇతర రాష్ర్టాల వాల్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు. వారికి వొక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదుచేసుకుంటున్నం.’’ అని సీఎం తెలిపారు.

అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి వుంటుందని సీఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని..తెలంగాణలో అదే జరుగుతున్నదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు… ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం,దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని వున్నదనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని సీఎం తెలిపారు. పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరం తో పాటు మరో కరోనా కాలపు రెండేండ్లు దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా, వ్యవసాయం విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, పల్లెలు పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతి, తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక ఐటి అభివృద్ధి, సింగరేణి, ప్రతి వొక్క రంగంలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన ప్రగతి గురించి సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news