రూట్ మారుస్తున్న కేసీఆర్… మునుగోడులో అవేం ఉండవా?

-

సాధారణంగా అధికార పార్టీలకు ఉపఎన్నికల్లో గెలవడం ఈజీ…పెద్ద కష్టం లేకుండానే గెలిచేస్తాయి. కానీ అదేంటో గాని తెలంగాణలో జరిగే ఉపఎనికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఉపఎన్నికలు వచ్చే స్థానాలకు వందల కోట్లు ఆఫర్లు ఇస్తున్నారు. అభివృద్ధి పనులు చేస్తున్నారు. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. ఇలా చేసిన గెలుస్తామనే నమ్మకం టీఆర్ఎస్ శ్రేణులకు ఉండటం లేదు. అందుకు ఉదాహరణగా దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలు నిలుస్తాయి. ఆ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు.

అయితే హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ గట్టిగానే కష్టపడింది…ఆ రెండు చోట్ల ఈజీగా ఏమి గెలవలేదు. కాంగ్రెస్ పోటీనే ఇచ్చింది. అలాగే అధికార బలమంతా ఉపయోగించి రెండు చోట్ల ఎలాగోలా గెలిచింది. కానీ దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కారు ప్లాన్ వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా హుజూరాబాద్ లో గెలవడం కోసం కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేశారో చెప్పాల్సిన పని లేదు. విపరీతంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం…పథకాలు అందించడం..అలాగే దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు దళితబంధు తీసుకొచ్చారు. ఇక అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ఖర్చి పెట్టారో చెప్పాల్సిన పని లేదు.

ఇన్ని చేసినా సరే హుజూరాబాద్ ప్రజలు ఈటలకే పట్టం కట్టారు. అంటే ప్రజా తీర్పుని డబ్బుతో కొనలేమని చెప్పొచ్చు. అందుకే ఈ సారి మునుగోడులో కేసీఆర్ రూట్ మారుస్తున్నారు. ఎలాగో మునుగోడు టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాదు…పైగా ఇక్కడ రాజకీయంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. అదే సమయంలో పూర్తి స్థాయిలో తాయిలాలు పంచడం, అభివృద్ధి పనులు పెద్ద మొత్తం లో నిధులు పంచే కార్యక్రమం చేయరని తెలుస్తోంది. ఈ సారి వ్యూహాత్మకంగా మునుగోడులో పనిచేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి చూడాలి కేసీఆర్ ప్లాన్స్ ఏ మేర వర్కౌట్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news