తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు శంకుస్థాపన చేశారు.రూ. 4,427 కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ రెండు ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.
శంకుస్థాపన కార్యక్రమంలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు, ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్సీలు శ్రీ పారుఖ్ హుస్సేన్, శ్రీ వెంకట్రామ్ రెడ్డి, శ్రీ శేరి శుభాష్ రెడ్డి, శ్రీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీ క్రాంతి కిరణ్, శ్రీ మాణిక్ రావు, శ్రీ మదన్ రెడ్డి, శ్రీ మహిపాల్ రెడ్డి, శ్రీ పద్మా దేవెందర్ రెడ్డి, టీఎస్ఎమ్ఎస్ఐడిసి చైర్మన్ శ్రీ ఎర్రోళ్ళ శ్రీనివాస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ సాయిచంద్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ శ్రీ దేవెందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివ కుమార్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరి శ్రీ రజత్ కుమార్, ఈఎన్సీ శ్రీ మురళీధర రావు తదీతరులు పాల్గొన్నారు.
సంగమేశ్వర లిప్టు ఇరిగేషన్
- నిధులు – రూ. 2653 కోట్లు
- ఆయకట్టు – 2.19 లక్షల ఎకరాలు
- పంప్ హౌజులు – 3
- లిప్టు ఎత్తు – 147 మీటర్లు
- విద్యుత్తు వినియోగం – 140 మెగావాట్లు
- కాల్వల దూరం – 206.40 కి.మీ
కాల్వలు
- రాయికోడ్ కెనాల్ – 56.85 కి.మీ
- మునిపల్లి కెనాల్ – 11.40 కి.మీ
- కంది కెనాల్ – 44.85 కి.మీ
- జహీరాబాద్ కెనాల్ – 30.95 కి.మీ
- గోవిందాపూర్ కెనాల్ – 19.15 కి.మీ
- హద్నూర్ కెనాల్ – 51.80 కి.మీ
ఆయకట్టు వివరాలు
1. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలు
2. ఆందోలు నియోజకవర్గంలో రెండు మండలాల పరిధిలోని 66 గ్రామాల్లో 65,816 ఎకరాలు
3. సంగారెడ్డి నియోజకవర్గం నాలుగు మండలాల పిరధిలోని 50 గ్రామాల్లోని 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలు
బసవేశ్వర ఎత్తిపోతల పథకం
- నిధులు – రూ. 1774 కోట్లు
- ఆయకట్టు – 1.65 లక్షల ఎకరాలు
- పంప్ హౌజులు – 2
- లిప్టు ఎత్తు – 59.75 మీటర్లు
- విద్యుత్తు వినియోగం – 70 మెగావాట్లు
- కాల్వల దూరం – 160.10 కి.మీ
కాల్వలు
- కరస్ గుత్తి కెనాల్ – 88.20 కి.మీ
- కసర్ గుత్తి బ్రాంచి కెనాల్ – 25.80 కి.మీ
- వట్ పల్లి కెనాల్ – 20 కి.మీ
- నారయణఖేడ్ కెనాల్ – 20కి.మీ
- రేగోడ్ కెనాల్ – 12.90 కి.మీ
- కంగ్గి కెనాల్ – 16.80 కి.మీ
- అంతర్ గావ్ కెనాల్ – 16.40 కి.మీ
ఆయకట్టు వివరాలు
1. నారాయణఖేడ్ నియోజకవర్గం ఆరు మండలాల పరిధిలో 130 గ్రామాల్లోని 1,31,000 ఎకరాలు
2. ఆందోల్ నియోజకవర్గంలో రెండు మండలాలు పరిధిలోని 36 గ్రామాల్లో 34,000 ఎకరాలు