విశ్వంలో అతిపెద్ద గెలాక్సీని గుర్తించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు

-

విశాల విశ్వం కోటానుకోట్ల గెలాక్సీల సమూహం… ఒక్కో గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో అనేకం ఉన్నాయి. మనకు తెలిసిన విశ్వంలోనే లక్షల సంఖ్యలో గెలాక్సీలు ఉన్నాయి. మానవుడు పంపించిన హబుల్ టెలిస్కోప్ ద్వారా కేవలం విశ్వంలోని ఒక చిన్న పాయింట్ వద్దే కొన్ని వేల గెలాక్సీలను కనుకున్నారు. అంటే ఈ విశ్వంలో మరెన్ని గెలాక్సీలు ఉన్నాయో కూడా ఉహించలేము. 

తాజాగా విశ్వంలో అతిపెద్ద గెలాక్సీని గుర్తించారు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు. ఇది 1.63 కోట్ల కాంతి సంవత్సారాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. కాంతి సెకన్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఈ గెలాక్సీ మొత్తం విస్తీర్ణం తెలుసుకోవడానికి 1.63 కోట్ల ఏళ్లు పడుతుందన్న మాట.  ప్రస్తుతం మనం ఉన్న మిల్కీవే గెలాక్సీ కన్నా 153 రెట్లు, మన సూర్యుడి కన్నా 24 వేల కోట్ల రెట్లు పెద్దగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి ‘ అల్సియోనెస్’  అనిపేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news