బ్రేకింగ్ : సాయంత్రం మరోసారి మీడియా ముందుకు కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు… విపక్షాలపై దూకుడును పెంచారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనంతరం.. స్వయంగా సీఎం కేసీఆర్.. విపక్షాల పై దాడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం ఏడు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. దాదాపు… మూడు గంటల పాటు మాట్లాడారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. దాన్యం కొనుగోలు, పెట్రోల్ ధరలపై కేంద్రానికి చురకలంటించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలకు.. ఇవ్వాళ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చేశారు.

సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ తప్పేనని తేల్చేశారు. అయితే అక్కడితో తగ్గని సీఎం కేసీఆర్.. ఇవాళ సాయంత్రం మరోసారి మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా ముందుకు రానున్నారు కెసిఆర్. ఈ సందర్భంగా బండి సంజయ్ కి మరోసారి ఫైర్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version