చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడుతా : సీఎం కేసీఆర్

-

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా”నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇవాళ కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు.  పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news