దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతాయి : సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసి సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండు, మూడు నెలల్లో తాను ఒక సంచలన వార్తను చెపుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై తాను చర్చించినట్టు చెప్పారు.

Enough Bhaashanbaazi But...": Telangana Chief Minister KCR After PM Modi's  Attack In Telangana

మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఎందరో ప్రధానులు వచ్చారని… కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. మన కంటే వెనుకబడి ఉన్న చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని… మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని… అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు సీఎం కేసీఆర్‌. మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోందని, జీడీపీ పడిపోయిందని చెప్పారు. కంపెనీలు మూత పడుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news