రేవంత్ రెడ్డిని కొడంగల్ లో లాగు పోయేదాకా జంపాలి : సీఎం కేసీఆర్

-

రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి పోయేదాకా జంపుతున్నరు.. ఇక్కడ కొడంగల్లో మీరు లాగు పోయేదాకా జంపాలి అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. పెన్షన్లను రూ.5వేలకు పెంచుతాం.. రైతుబంధును పుట్టించిందే బీఆర్‌ఎస్.. ఉత్తమ్‌కుమార్‌ రైతుబంధు వృథా అని అంటున్నారు.. రైతుబంధును రూ.16వేలకు పెంచుతాం.. వ్యవసాయానికి 3 గంటలు సరిపో రేవంత్‌ రెడ్డి అంటున్నారు.. రైతులు 10HP మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు.. 10HP మోటార్లు ఎవరు కొనిస్తారు.. రేవంత్‌ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడు.. ధరణిని తీసి భూమాత అని పెడతారంటా.. భూమాతనా, భూమేతనా అని ఎద్దేవా చేశారు.

పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చే రేవంత్‌రెడ్డి ఇస్తాడా? సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆలోచించి పని చేసే వారికి, ప్రజలకు సేవచేసే వారికి ఓటు వేస్తే కొడంగల్‌ మరింత అభివృద్ధి చెందుతుంది. మీరు తప్పకుండా నిలబడ్డ అభ్యర్థి ఎటువంటి వాడు, అవకాశం ఎట్ల పని చేస్తడు ? ప్రజల ఎలా అందుబాటులో ఉంటడు. అభివృద్ధి కోసం ఎట్ల తండ్లాడుతడు అని ఆలోన చేయాలి. ప్రతి అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, దృక్పథం ఏంది ఆలోచించాలని కోరుతున్నానని తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version