సిద్దిపేటకు చేరుకున్న సీఎం కేసీఆర్.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

కాసేపటి క్రితమే సిద్దిపేట పట్టణానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అ తర్వాత సిద్దిపేట కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి చేరుకున్నారు. సీఎం కెసిఆర్ వెంట మంత్రులు మహముద్ అలీ, ప్రశాంత్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిపీ జోయల్ డేవిస్ సిఎం కెసిఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు సిఎం కెసిఆర్. అనంతరం కొండపాక మండలం దుద్దెడ లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

చివరగా కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హల్ లో ప్రజా ప్రతినిధులు, అధికారుల తో సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ పగలు  2.30 సమయంలో  సిద్దిపేట జిల్లాలో సీఎం కెసిఆర్ పర్యటన ముగియనుంది.