రోజు రోజుకు వావివరసలు మరిచి కళ్లు నెత్తికెక్కి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కొందరు. కొడుకు కావాలనే పిచ్చితో కన్న కూతుళ్లపైనే అత్యాచారానికి దిగాడో దుర్మార్గపు తండ్రి, తానే కాకుండా తాంత్రికుడైన తన స్నేహితుడి పంటి కింద కన్న కూతుళ్ల జీవితాలను పండుగా అందించాడు.. ఈ దుర్మార్గపు ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బక్సర్ జిల్లా రాజ్పూర్ మండలంలోని కన్న బిడ్డలకు విటమిన్ టాబ్లెట్స్ పేరుతో మత్తుమందు ఇచ్చి తన స్నేహితుడైన తాంత్రికుడితో అత్యాచారం చేయించాడు.
అంతటితో ఆగకుండా వావివరుసలు మరిచి తండ్రి సైతం కూతుర్లను అనుభవించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. దీనిని గుర్తించిన కూతుర్లు.. వారు చేస్తున్న చర్యలకు ఎదురు తిరిగారు. దీంతో బాలికలను వేధించడం, కొట్టడం చేసేవారు. ఇంట్లో ఉన్న తల్లి, మేనత్త కూడా వాళ్లకు అడ్డు చెప్పకపోగా వాళ్లకు సహకరించే వారు. దీంతో కామాంధుల మధ్య ఇంట్లో
ఉండలేక మైనర్ బాలికలైన కూతుర్లు ఇల్లు వదిలి పారిపోయారు.
‘బక్సర్ జిల్లా కేంద్రంలో ఓ గదిలో అద్దెకు ఉండేవారు. తండ్రి, తాంత్రికుడు చేసిన నిర్వాకాన్ని ఎలాగైనా బయట పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు తండ్రి చేసిన ఘాతుకం మొత్తాన్ని వివరించి వాళ్లు లేఖ రాశారు. ఎలాగైన ఈ సమస్య నుంచి తమను కాపాడి, తండ్రికి, తాంత్రికుడికి తగిన బుద్ధి చెప్పాలని, కఠినంగా శిక్షించాలని కోరారు. మైనర్ బాలికల ఫిర్యాదు మేరకు బక్సర్ జిల్లా ఎస్పీ ఎఫ్ఎఆర్ నమోదు చేసుకుని తండ్రి, తాంత్రికుడు వీళ్లతోపాటు మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బాలికల తల్లి, అత్త పాత్ర కూడా ఉందని తెలిసి అందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.