గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల గురించి తీర్మాణం చేసి పంపిస్తే అక్కడి గవర్నర్ ఏడాదిగా ఆయన దగ్గరే పెట్టుకున్నారని.. తమిళనాడులో క్యాబినెట్ తీర్మాణం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే ఆమోదం తెలపలేదని కేసీఆర్ గుర్తు చేశారు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కేరళల్లో గవర్నర్లతో పంచాయతీ నెలకొందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దుర్మార్గమైన గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి పదవి కోల్పోయేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని… ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి కూర్చిలో కూర్చోబెట్టే విధంగా పోరాడారని అన్నారు. ఎన్టీఆర్ తో దుర్మార్గంగా వ్యవహరించిన గవర్నర్ అవమానంతో ఇక్కడ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇదంతా జరిగిన చరిత్రనే కదా.. ప్రజాస్వామ్యంలో పరిణితి ఉండాలని.. ఎన్టీఆర్ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలని.. కానీ దానికి వక్రమార్గంగా జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ ఫైర్… మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడుల్లో గవర్నర్లతో పంచాయతీ
-