దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దళిత బంధు సెకండ్ పేజీ పురోగతిపై తాజాగా సీఎం కేసీఆర్ తీశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏకంగా 500 యూనిట్ల చొప్పున మంజూరు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వీటి అమలు ప్రక్రియ ప్రారంభం చేయాలని తెలంగాణ cs సోమేశ్ కుమార్ ను మంగళవారం ఆదేశించారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అలాగే లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని cs సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 10 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుండగా, ఆర్థిక సహాయంతో వారి జీవితాలు శాశ్వతంగా సెటిల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.