కేసీఆర్ ప్రెస్ మీట్ లో Surf Excel వీడియో పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసందర్భంగా నా పేరు ప్రస్తావించి నేనేదో కేసుల భయంతో బీజేపీలో చేరినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
నా మీద ఒక్క సీబీఐ, ఈడీ కేసు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధిన కేసు కానీ లేదు.. మీరు ఉన్నట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్దం!అని సవాల్ విసిరారు సీఎం రమేష్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారంతో మాట్లాడితే బాగుంటుంది.. గతంలో మీ కుమారుడు కేటీఆర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు సరి చేసుకుంటారని భావిస్తూ.. ప్రజలకు వాస్తవాలు మాత్రమే చెప్పాలని విన్నవిస్తున్నానని నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇక దీనిపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.