కిషన్ రెడ్డి వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

-

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని వెంటనే బడ్జెట్‌ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని రేవంత్ రెడ్డి కేంద్రానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

41 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేవలం ఎన్డీఏ మిత్ర పక్ష రాష్ట్రాలకే దోచిపెట్టారని మండిపడ్డారు.నిధులు కేటాయించకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బీజేపీకి బానిసల్లా పని చేయొద్దని అన్నారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన 8 ఎంపీ సీట్లతోనే మోడీ ప్రధాని కూర్చీలో కుర్చున్నారని.. 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటింగ్ ఇచ్చినప్పటికీ తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు లేఖ రాశారు. మరీ ఐఐఎం తెలంగాణకు ఇవ్వనప్పుడు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని.. వెంటనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version