సీఎం రేవంత్ జపాన్ పర్యటన షెడ్యూల్ విడుదల

-

సీఎం రేవంత్ జపాన్ పర్యటన షెడ్యూల్ విడుదల ఐంది. ఈ నెల 16 నుంచి 21 వరకు సీఎం రేవంత్ జపాన్ పర్యటన ఉండనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జపాన్ కు వెళ్లనున్నారు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం. మొద టిసారి జపాన్ లో ఒకాస ఇండస్ట్రియల్ ఎక్స్పో లో ఇండియా పెవిలియన్ ఉండనుంది.

revanth

కేంద్రం కేటాయించిన పెవిలియన్ లోనే రాష్ట్ర ప్రభుత్వ స్టాల్ ఏర్పాటు కానుంది. ఒకాస ఇండస్ట్రియల్ ఎక్స్ పోకు హాజరుకానున్నారు ప్రధాని మోడీ. ఇక అటు కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేయడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఈ తరుణంలోనే AI ఫోటోలు, వీడియో లను ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ అయ్యారు. ఫేక్ అని తెలిశాక కూడా ఆ పోస్టులను తొలగించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పారు అధికారులు. ఫేక్ వీడియో లను కట్టడి చేసేందుకు సైబర్ క్రైం స్పెషల్ టీం ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news