బిగ్ బ్రేకింగ్ : బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ ను విడిచిపెట్టిన మావోలు

-

ఐదు రోజుల నుండి మావోయిస్టుల చెరలోనే ఉన్న కోబ్రా దళానికి చెందిన జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోలు విడుదల చేసినట్టు సమాచారం. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జవాన్ ను రిలేజ్ చేసినట్టు చెబుతున్నారు. కాసేపట్లో రాకేశ్వర్ సింగ్ బెటాలియన్ వద్దకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 3న భద్రతా దళాలు – మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల సమయంలో రాకేశ్వర్ సింగ్ మావోలకు చిక్కాడు. .

దాదాపు ఐదు రోజుల పాటు వారి మధ్య బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ ను ఈరోజు విడుదల చేశారు.  ఈనెల 3న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులోని టెర్రాం అటవీ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడి చేసి 24 మంది జవాన్లను చంపేసిన నక్సల్స్.. ఒక జవాన్ ను బందీగా తీసుకెళ్లాను. అనంతరం అతని విడుదలకు సిద్ధమంటూ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేయడం, అందులో కేంద్ర, రాష్ట్రాల పై ఆరోపణలు గుప్పించడం, ఎన్ కౌంటర్ తాలూకు డ్రోన్ వీడియో ని సైతం విడుదల చేశారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version