‘విరాట పర్వం’ సినిమాను నిషేధించాలి..పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

-

శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘విరాట పర్వం’ సినిమాను నిషేధించాలని కంప్లయింట్ వచ్చింది. వివరాల్లోకెళితే..హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ నాయకులు కె.అజయ్ రాజ్..‘విరాట సర్వం’ సినిమాను నిషేధించాలని కంప్లయింట్ ఇచ్చారు.

నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఎలా ఇచ్చిందని అడిగారు. సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ ను బాధ్యుడిని చేస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సినిమా ప్రదర్శన నిలిపేయాలని, నిషేధించాలని డిమాండ్ చేశారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పిక్చర్ ఉందని, ఇందులో చాలా అభ్యంతరకర సన్నివేశాలున్నాయని పేర్కొన్నారు. పోలీసులనూ కించ పరిచే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయని ఆరోపించారు. ‘విరాట పర్వం’ మూవీ టీమ్ ఈ ఫిర్యాదులపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version