ముగిసిన సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియలు

-

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చలపతిరావు గత శనివారం కన్నుమూశారు. అయితే నేడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. చలపతిరావు కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నిర్మాతలు సురేశ్ బాబు, దామోదర ప్రసాద్, దర్శకులు బోయపాటి శ్రీను, శ్రీవాస్, హీరో మంచు మనోజ్, నటుడు గౌతమ్ రాజు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Chalapathi Rao Death News: Ace Tollywood actor Chalapathi Rao passes away  at 78 due to heart attack | - Times of India

ఈ నెల 24న చలపతిరావు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉండటంతో వారి రాక ఆలస్యమయింది. దీంతో ఆయన భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించారు. 1,200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news