టీమిండియా జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవా ధోనీకి లియోనెల్ మెస్సి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మెస్సి సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా అందించారు. ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా ఫ్రాన్స్‌ను ఓడించడంతో ఫిఫా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.
క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ మహేంద్ర సింగ్ ధోని గతంలో చాలాసార్లు చెప్పారు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలో మెస్సీ ఆటోగ్రాప్ చేసిన జెర్సీ అందుకోవడంపై జివా సంతోషం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.