మొదటి రోజు ముగిసిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా వైసీపీ ప్లీనరీ వేడుకలు గుంటూరులో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం ప్రారంభమైన తొలి రోజు స‌మావేశాలు ప్లీనరీ సమావేశాలు సాయంత్రం ముగిశాయి. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మొద‌లైన స‌మావేశాలు సాయంత్రం దాకా కొన‌సాగాయి. పార్టీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభోప‌న్యాసం చేయ‌గా… పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ కూడా ప్ర‌సంగించారు.

Two-day YSRCP Plenary to be a Grand Affair: Vijayasai Reddy

ఆ త‌ర్వాత జ‌గ‌న్ కేబినెట్‌లోని ప‌లువురు మంత్రులు ఆయా అంశాల‌పై ప్ర‌సంగాలు చేశారు. తొలి రోజు ప్లీన‌రీలో వైసీపీ నేత‌లు 4 తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌గా…వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌లు, నవ ర‌త్నాలు- డీబీటీ, వైద్య ఆరోగ్య రంగంపై ఈ తీర్మానాల‌ను ఆమోదించారు. ఇక రెండో రోజైన శ‌నివారం నాటి ప్లీన‌రీలో మ‌రో 5 తీర్మానాల‌పై చ‌ర్చ‌ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు వైసీపీ నేతలు. అయితే.. ఉదయం గౌరవ అధ్యక్షురాలి హోదాలో ప్రసంగించిన విజయమ్మ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news