నేడు, రేపు విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీ పర్యటనకు విచ్చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం వర్షం వల్ల మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగాకు పయనమయ్యారు. తూర్పుతీర నౌకాదళ స్థావరంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షో నిర్వహించారు.
ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు భారీగా సంఖ్యలో బీజేపీ శ్రేణులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు రావడంతో.. వారికి కారునుంచే అభివాదం చేశారు మోడీ. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ హోటల్ నోవోటెల్ నుంచి ప్రధాని మోదీతో సమావేశం కోసం చోళ సూట్ కు చేరుకున్నారు. రోడ్ షో ముగియడంతో ప్రధాని మోడీ సైతం ఐఎన్‌ఎస్ చోళ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అయితే.. ఇప్పుడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ మోడీ సమావేశం కానున్నారు. ఏపీలో రాజకీ పరిస్థితులపై ఏపీ బీజేపీ కోర్ కమిటీ మోడీకి వివరించనుంది. అలాగే.. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మోడీ భేటీ అవుతారు.