డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యంపై స్పందించిన మంత్రి హరీశ్‌ రావు

-

డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. తాజా మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక వల్లే డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యమైందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో 969 పీహెచ్ సీ డాక్టర్ల సర్టిఫికేట్లు వెరిఫై చేసి తొందర్లోనే నియామక పత్రాలు అందజేస్తామన్నారు మంత్రి హరీశ్‌ రావు. హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో తెలంగాణ PHC మానిటరింగ్ హబ్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్‌ రావు. 4500 పల్లె దవాఖానలో 2900 ఏఎన్ఎమ్ సబ్ సెంటర్లుగా మార్చుతున్నామన్నారు మంత్రి హరీశ్‌ రావు.

Minister Harish Rao : సీజనల్ వ్యాధులపై కీలక ఆదేశాలు - NTV Telugu

3800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 1569 పల్లె దవాఖానల్లో పోస్టుల భర్తీ ఎన్నిక వల్ల ఆలస్యం అయ్యిందన్నారు మంత్రి హరీశ్‌ రావు. బస్తీ దవాఖానలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించిందని హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనితీరు పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎమ్ఈ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news